ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 17, 2021, 3:06 PM IST

Updated : Aug 17, 2021, 6:03 PM IST

ETV Bharat / state

Lokesh Kurnool Tour: చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఇతరులకేం చేస్తారు: లోకేశ్

తెదేపా నేత నారా లోకేశ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఎర్రబాడుకు చేరుకొని ఏడాది క్రితం హత్యకు గురైన యువతి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. రాష్ట్రంలో 500 మంది మహిళలపై దాడి జరిగిందని లోకేశ్ ఆక్షేపించారు. చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఇతరులకేం చేస్తారని మండిపడ్డారు. వివేకా కుమార్తెకు రాష్ట్రంలో భద్రత లేదని విమర్శించారు.

Lokesh Kurnool Tour
Lokesh Kurnool Tour

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో ఏడాది క్రితం హత్యకు గురైన యువతి కుటుంబాన్ని ఆయన పరామర్శించాడు.

రాష్ట్రంలో 500 మంది మహిళలపై దాడి జరిగింది. చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఇతరులకేం చేస్తారు. వివేకా కుమార్తెకు భద్రత లేదు. సీఎం సొంత నియోజకవర్గంలో రక్షణ లేదు. సీమలో ఒక చెల్లిని చంపితే పరామర్శకు జగన్ రాలేదు. నంద్యాలలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. నంద్యాల ఘటనపై సీబీఐ విచారణ వేస్తామని 8 నెలలైంది. -లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

అంతకు ముందు కోడుమూరులో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి లోకేశ్ నివాళులర్పించారు. జిల్లా పర్యటనకు వచ్చిన లోకేశ్​కు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

లోకేశ్ పర్యటన అడ్డుకునేందుకు వైకాపా నేతల యత్నం

నారా లోకేశ్ పర్యటనను అడ్డుకునేందుకు వైకాపా నాయకులు యత్నించారు. కర్నూలు నగరం బళ్లారి చౌరస్తాలో లోకేశ్​కు వ్యతిరేకంగా వైకాపా నేతలు నినాదాలు చేశారు. వద్ద వైకాపా నాయకులు చేరుకుని లోకేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధిత యువతి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తుందని..,లోకేశ్ ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి

నేడు కర్నూలుకు లోకేశ్.. యువతి హత్య బాధిత కుటుంబానికి పరామర్శ

Last Updated : Aug 17, 2021, 6:03 PM IST

ABOUT THE AUTHOR

...view details