దేశ వ్యాప్తంగా స్వచ్ఛత పక్వాడా పరిశుభ్రత పక్షోత్సవాలు సెప్టెంబరు 16 నుంచి ఈ నెల 2 వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు డివిజన్‌లో నంద్యాల ప్రథమ స్థానంలో నిలిచింది. రైల్వే బోర్డు అప్పగించిన స్వచ్ఛ పక్వాడా పక్షోత్సవాల్లో ఎంపిక చేసిన 720 స్టేషన్లను నాణ్యత నియంత్రణ శాఖ వారు వ్యక్తిగతంగా స్టేషన్‌లో స్వచ్ఛతపై ప్రయాణికులకు అవగాహన, రైళ్లు పరిశుభ్రత, కార్యాలయాలు, తదితర విషయాలను పరిశీలించి స్టేషన్ల వారీగా మార్కులు ప్రకటించారు. ఇందుకు రైల్వే ఉన్నతాధికారులు ఆరోగ్య విభాగం సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. అధికారులకు ప్రత్యక్షంగా దశల వారీగా రికార్డులు పరిశీలించారు. వీటన్నిటిలోనూ కర్నూలు జిల్లా నంద్యాల రైల్వే స్టేషన్ అగ్రస్థానంలో నిలిచింది.
పచ్చదనంలో నంద్యాల రైల్వే స్టేషన్కు అగ్రస్థానం - పచ్చదనంలో నంద్యాల రైల్వే స్టేషన్కు అగ్రస్థానం
స్వచ్ఛ రైల్వే, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఇటీవల నిర్వహించిన పరిశుభ్రత పక్షోత్సవాల్లో కర్నూలు జిల్లాకు 5 ర్యాంకులు దక్కాయి. నంద్యాల రైల్వే స్టేషన్కు మొదటి స్థానం వచ్చింది.
పచ్చదనంలో నంద్యాల రైల్వే స్టేషన్కు అగ్రస్థానం