ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆసుపత్రిలో నీటి కొరత...రోగులకు తప్పని తిప్పలు - Nandyala hospital

ఈ ఏడాది వర్షాలు ఆశించిన రీతిలోనే కురిశాయి. కర్నూలు జిల్లాలోని ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. కాలువలకు నీళ్లొచ్చాయి. అయినా జిల్లాలోని నంద్యాలను మాత్రం నీటి సమస్య వేధిస్తోంది. ఈ సమస్య నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు మరింత ఎక్కువగా ఉంది.  రోజుకు 2 లక్షల లీటర్ల నీటి అవసరం ఉన్నా...తగిన నీరు లభించక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆసుపత్రికి నీటి కష్టాలు...రోగులకు తప్పని తిప్పలు

By

Published : Aug 31, 2019, 7:01 PM IST

ఆసుపత్రికి నీటి కష్టాలు...రోగులకు తప్పని తిప్పలు
కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు రోజూ 1000 మందికి పైగా రోగులు వస్తుంటారు. రోగులు, వారి బంధువుల తాకిడితో ఆసుపత్రిలో నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఆసుపత్రిలో మాతా శిశుకేంద్రం, డయాలిసిస్ కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వైద్యశాలకు రోజూ 2 లక్షల లీటర్ల నీరు అవసరం ఉంటుంది. నీటి వినియోగం ఎక్కువగా ఉండడం వలన ఆసుపత్రి ఆవరణలో బోర్లు వేసే ప్రయత్నం చేశారు. కానీ నీరు పడకపోవడంతో పురపాలక సంస్థ సరఫరా చేసే నీటినే వినియోగిస్తున్నారు. బయట బోర్ల నుంచి 20 వేల లీటర్లు, పురపాలక సంఘం నుంచి 15 వేల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. అయినా నీటి సమస్య కొనసాగుతూనే ఉంది. నీటికొరతతో ఆసుపత్రి వచ్చే రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు.

ఇదీ చదవండి :

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details