కర్నూలు జిల్లా నంద్యాల ములసాగరానికి చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం(భార్య, ఇద్దరు పిల్లలు)తో సహా నవంబరు మూడో తేదీన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. సలాం ఆటోలో ఓ ప్రయాణికుడి నుంచి నగదు చోరీ అయిన ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు సలాంను ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో విచారించారు. ఈ విచారణలో సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ ఉన్నారని తెలిసింది. గత ఏడాది బంగారు దుకాణంలో జరిగిన ఓ చోరీలో సలాం నిందితుడిగా ఉన్నారు. తనను పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని, కేసుల్లో తనను ఇరికించారని ఆవేదనతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సలాం సెల్ఫీ వీడియో తీశారు.
సలాం కుటుంబం ఆత్మహత్య కేసు...సీఐ, హెడ్ కానిస్టేబుల్ బెయిల్ రద్దు - కర్నూలు జిల్లా వార్తలు
అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ బెయిల్ రద్దు చేస్తూ కర్నూలు జిల్లా నంద్యాల మూడో అదనపు జిల్లా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. డిసెంబరు రెండో తేదీ సాయంత్రం లోపు వారిద్దరిని కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది.
ఈ ఘటనపై ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేపట్టింది. సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌లను సస్పెండ్ చేసి, వారిపై కేసు నమోదు చేసి నవంబరు ఎనిమిదిన అరెస్టు చేశారు. అదే నెల తొమ్మిదో తేదీన వారికి బెయిల్ మంజూరైంది. బెయిల్ రద్దు చేయాలని పోలీసులు నంద్యాల మూడో అదనపు జిల్లా జడ్జి కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. కేసును పలు మార్లు వాయిదా వేసిన కోర్టు నవంబరు 30న విచారణ జరిపి బెయిల్ రద్దు చేసింది. సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌ను డిసెంబరు రెండో తేదీ సాయంత్రంలోపు కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది.
ఇదీ చదవండి :ప్రేమికుడిని అరెస్టు చేసిన ఎస్సై... వీఆర్‌కు పంపిన ఎస్పీ