ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాల ఘటన.. పోలీసుల పిటిషన్‌పై విచారణ వాయిదా - Auto driver family suicide news

కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ బెయిల్ రద్దు గురించి పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ విచారణ మంగళవారానికి వాయిదా పడింది. పిటిషన్​ను విచారించిన అనంతరం నంద్యాల మూడో అదనపు జిల్లా కోర్టు వాయిదా వేసింది.

Nandyal incident .. Postponement of hearing on police petition
నంద్యాల ఘటన.. పోలీసుల పిటిషన్‌పై విచారణ వాయిదా

By

Published : Nov 16, 2020, 3:15 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసుల పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. నంద్యాల మూడో అదనపు జిల్లా కోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. సీఐ, హెడ్‌ కానిస్టేబుల్‌కు ఇచ్చిన బెయిల్‌ రద్దు చేయాలని పోలీసులు పిటిషన్‌ వేశారు. కేసులో అరెస్టై సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌ బెయిల్‌ పొందారు.

బెయిల్​ రావడంపై విమర్శలు...

అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ఫరూక్ సుబ్లీ డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే తక్షణం రాజీనామా చేయాలన్నారు. సలాం ఆత్మహత్యకు కారకులైన వారందరినీ అరెస్టు చేయాలని కోరిన ఆయన.. సీఐ, హెడ్ కానిస్టేబుల్​కు మంజూరైన బెయిల్​పై అసహనం వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా సంతాపం...

పోలీసుల వేధింపులు భరించలేక అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని... రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, మైనారిటీ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఆత్మహత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి సంతాపం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండీ... సార్..నేను ఏ తప్పూ చేయలేదు: ఆత్మహత్యకు ముందు డ్రైవర్​ ఆవేదన

ABOUT THE AUTHOR

...view details