ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నందికొట్కూరులో రహదారి పనులు.. నాలుగేళ్లుగా సాగదీత! - నందికొట్కూరు రహదారి పనులు న్యూస్

నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా కీర్తికిరీటం పెట్టారే తప్ప.. అభివృద్ధి మాత్రం అటకెక్కింది. ప్రధానంగా రహదారులు విస్తరణకు నోచుకోక ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. రోడ్డు విస్తరణ పనుల్లో దుకాణాలు కోల్పోయిన బాధితులు పరిహారం కోసం కోర్టు మెట్లు ఎక్కటంతో... అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడ్డాయి. ఫలితం... నిత్యం ప్రమాదాల మాటున ఇంటికి చేరాల్సిన పరిస్థితి. ఇదీ.. కర్నూలు జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ తీరు!

road construction stops in nandikotkur
నిలిచిన నందికొట్కూరు రహదారి విస్తరణ పనులు

By

Published : Dec 21, 2020, 3:40 PM IST

నిలిచిన నందికొట్కూరు రహదారి విస్తరణ పనులు

కర్నూలు జిల్లా నందికొట్కూరు వాసులు రహదారుల వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నందికొట్కూరు ప్రధాన రహదారిని ఇరువైపులా 20 అడుగులు వెడల్పు చేసేందుకు 2017లో శ్రీకారం చుట్టూరు. అప్పటి మున్సిపాలిటీ కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి 2 కి.మీ మేర రహదారి వెంబడి ఉన్న దుకాణదారులతో మాట్లాడారు. విస్తరణలో కోల్పోయిన దుకాణాలు, తిరిగి నిర్మించుకుంటే.. మున్సిపాలిటీ ఎటువంటి రుసం వసూలు చేయదని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.

సుమారు 800 దుకాణాలు కూల్చి, విస్తరణ చేపట్టారు. జాతీయ రహదారి అధికారులు రోడ్లు వేయాల్సిన సమయంలో కొందరు పరిహారం ఇవ్వాలంటూ కోర్టు మెట్లెక్కారు. దీనివల్ల నాలుగేళ్లుగా రహదారులు, డ్రైనేజీలు, డివైడర్ల ఏర్పాటు జరగలేదు.

డివైడర్ల ఏర్పాటుకు 2 కోట్ల రూపాయలు కేటాయించామంటూ స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్ ప్రకటించినా... నిర్మాణ పనులు ఏ మాత్రం ముందుకు కదల్లేదు. కొత్త బస్టాండ్ నుంచి జమ్మిచెట్టు వరకు ఈ పనులు చేపట్టేందుకు నిర్ణయించినా ఆ దిశగా అడుగులు పడలేదు.

కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారి కావటం కారణంగా.. రోజుకు 5 వందలకుపైగా భారీ వాహనాలు, 200 బస్సులు, కార్లు, ఆటో, ట్రాక్టర్లు ఇలా వెయ్యికి పైగా వాహనాలు తిరుగుతుంటాయి. డివైడర్లు లేక రోజుకొక చిన్నచిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏటా వందల సంఖ్యలో వాహనాలు ఢీకొని ఆసుపత్రి పాలవుతున్నారు.

మున్సిపాలిటీ అభివృద్ధికి వ్యతిరేకం కాదనీ... దుకాణదారులు కోర్టుకు వెళ్లారు కాబట్టే అభివృద్ధి ఆగిపోయిందని మున్సిపాలిటీ అధికారులు ఆరోపిస్తున్నారనీ.. ఈ విధంగా చెప్పటం సరికాదని దుకాణ యజమానులు వాపోతున్నారు.

వాహనదారుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని.. త్వరతిగతిన రహదారి పనులు పూర్తి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే పనులు పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:ఘోరంగా పడిపోయిన టమాటా ధరలు.. లబోదిబోమంటున్న రైతులు

ABOUT THE AUTHOR

...view details