ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శివాలయంలోని నంది విగ్రహం అపహరణ - సి బెళగల్​లో నంది విగ్రహం అపహరణ

కర్నూలు జిల్లా సి బెళగల్ మండలం ఇనగండ్ల శివాలయంలోని నంది విగ్రహాన్ని కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారు. ఈ సందర్భంగా నేరస్తులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని పోలీసులను కోడుమూరు నియోజకవర్గ భాజపా నేత ప్రేమ్ కుమార్ కోరారు.

Nandi idol was abducted of Inagandla Shiva temple in Kurnool district C Belgaul zone
నంది విగ్రహం అపహరణ... నేరస్తులు కఠినంగా శిక్షించాలి...

By

Published : Mar 14, 2021, 6:55 AM IST

కర్నూలు జిల్లా సి బెళగల్ మండలం ఇనగండ్ల శివాలయంలో గర్భగుడికి ఎదురుగా ఉన్న నంది విగ్రహాన్ని శుక్రవారం అర్ధరాత్రి కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. విషయం తెలుసుకున్న స్థానికులు శనివారం ఉదయం గ్రామంలో దండోరా వేయించారు. ఈ సందర్భంగా శివాలయంలోని అపహరణకు గురైన నంది విగ్రహం ప్రాంతాన్ని కోడుమూరు నియోజకవర్గ భాజపా నేత మీసాల ప్రేమ్ పరిశీలించారు. అనంతరం సి.బెళగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరస్తులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని ప్రేమ్ కుమార్ కోరారు.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లా పురపాలికల ఓట్ల లెక్కింపునకు పూర్తైన ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details