లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే క్వారంటైన్కే..! - nandayala police new idea
కర్నూలు జిల్లా నంద్యాల పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని అంబులెన్స్‌లో క్వారంటైన్ కు తరలిస్తున్నారు.
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని అంబులెన్స్‌లో క్వారంటైన్ కు తరలించే కార్యక్రమానికి కర్నూలు జిల్లా నంద్యాల పోలీసులు శ్రీకారం చుట్టారు. పట్టణంలోని రెడ్ జోన్ ప్రాంతం గిరినాథ్ సెంటర్లో బయటకు వచ్చిన కొంతమంది యువకులను అంబులెన్స్ ద్వారా క్వారంటైన్‌కు తరలించారు. అధికారుల ఆదేశాల మేరకు ప్రజల్లో భయం, అవగాహన తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పోలీసులు తెలిపారు.