కర్నూలు జిల్లా నందవరం మండలం నాగలదిన్నెలో పెద్దమ్మ అమ్మవారి విగ్రహ, ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. వీరికి భాజపా నాయకులు సంఘీభావం తెలిపారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి కారణంగానే విగ్రహ ప్రతిష్ఠను అడ్డుకోవడం సరికాదని భాజపా నాయకులు అన్నారు.
అమ్మవారి విగ్రహ, ధ్వజస్తంభం ప్రతిష్ఠను అడ్డుకున్న అధికారులు - nandavaram people protest at tahsildar office
నాగలదిన్నెలో అమ్మవారి(పెద్దమ్మ) విగ్రహ, ధ్వజస్తంభం ప్రతిష్ఠ కార్యక్రమాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు అడ్డుకున్నారు. ఆగ్రహించిన గ్రామస్థులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు.
నందవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రామస్థులు నిరసన