ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్​లో అలసిన ప్రజలకు.. లాంచీ ప్రయాణంతో ఉల్లాసం - కృష్ణా నదిలో లాంచీ ప్రయాణం

లాక్​డౌన్​తో విసిగిపోయిన ప్రజలకు లాంచీ ప్రయాణం ఉల్లాసాన్ని ఇచ్చింది. కృష్ణా నదిలో చూట్టూ పచ్చని కొండల నడుమ , ఊయ్యాల్లో ఊగుతూనట్లుగా సాగిపోయిన ప్రయాణం పర్యటకులకు ఆహ్లాదాన్ని కలిగించాయి. కనుచూపు మేర నీటితో కనువిందు చేస్తున్న దృశ్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

Nagarjunasagar- Srisailam launch journey
లాక్​డౌన్​లో అలసిన ప్రజలకు లాంచీ ప్రయాణం

By

Published : Nov 22, 2020, 1:31 PM IST

నాగార్జునసాగర్ - శ్రీశైలం లాంచీ ప్రయాణం విజయవంతంగా ఆరంభమైంది. తెలంగాణ రాష్ట్ర పర్యటక శాఖకు చెందిన లాంచీ.. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం చేరుకుంది. హైదరాబాద్.. పరిసర ప్రాంతాలకు చెందిన పర్యటకులు ఈ విహారానికి ఆసక్తి చూపారు. ఉదయం 10 గంటలకు నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి 16 మంది పర్యటకులతో లాంచీ వచ్చింది.

కృష్ణా నది లో ప్రయాణిస్తూ, నదికి ఇరువైపులా ఉన్న సుందరమైన నల్లమల కొండల అందాలు, ప్రకృతి సోయగాలను పర్యటకులు ఆస్వాదించారు. ఈ రాత్రి శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం శ్రీశైలం హరిత రిసార్ట్స్ లో ప్రయాణికులకు బస ఏర్పాటు చేశారు. రేపు ఉదయం మరోసారి స్వామి అమ్మవార్లను దర్శించుకుని లాంచీలో నాగార్జునసాగర్ తిరిగి వెళ్లనున్నారు. అక్కడినుంచి హైదరాబాద్ చేరుకుంటారు.

ABOUT THE AUTHOR

...view details