ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వచ్ఛ నంద్యాల.. ఔరా అనేలా...! - nadyala swachha bharat

కర్నూలు జిల్లా నంద్యాలను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు పురపాలక సంఘం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. పురపాలక సిబ్బంది వినూత్న రీతిలో వాణిజ్య, వ్యాపార, గృహ సముదాయల నుంచి విడివిడిగా చెత్త సేకరిస్తున్నారు. తడి చెత్తతో ఎరువులు, పొడి చెత్తను పునర్వినియోగిస్తూ స్వచ్ఛత వైపు అడుగులు వేస్తోంది నంద్యాల.

nadyala muncipality clean drive and waste disposable
స్వచ్ఛ నంద్యాల.. ఔరా అనేలా...!

By

Published : Dec 21, 2019, 5:31 PM IST

నంద్యాలను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేలా పురపాలక సిబ్బంది కార్యాచరణ
స్వచ్ఛభారత్​ సాధనకు అనుగుణంగా.. పట్టణాలను స్వచ్ఛతకు మారుపేరుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వివిధ పథకాలు, పురస్కారాలు ప్రవేశపెట్టి, స్వచ్ఛత సాధించేలా ఊతమిస్తున్నాయి. ఈ పథకాలను అందిపుచ్చుకుంటున్న కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం స్వచ్ఛతలో ఓ అడుగు ముందుకేసింది.

తడి, పొడి చెత్త వేరువేరుగా

పురపాలక పరిధిలోని వాణిజ్య, వ్యాపార, గృహ సముదాయాల నుంచి నేరుగా చెత్తను సేకరిస్తోంది. చెత్త సేకరణలోనే... తడి, పొడి చెత్తను వేరు చేస్తోంది. ఇలా సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువులు తయారుచేస్తున్నారు. పొడి చెత్తను పునర్వినియోగిస్తున్నారు. వీటితో పాటు ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. పొడి చెత్త పునర్వినియోగం కోసం మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ అనే కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నంద్యాల పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేదుకు కృషిచేస్తున్నామంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details