పుట్టినరోజు జరుపుకోవడం అంటే ఓ సరదా. కానీ.. వారికి అదే చివరి రోజు అవుతుందని ఊహించలేదు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన ఆరిఫ్ది (18) జులై 1 న పుట్టినరోజు. తన పుట్టిన రోజును స్నేహితులు సులేమాన్ (19), ఈశ్వర్, గఫార్ లతో సరదాగా గడపటం కోసం ఆళ్లగడ్డ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని గన్లేరు జలాశయానికి వెళ్లారు. ఈ క్రమంలో వారు మద్యం సేవించారు. మద్యం మత్తులో ఆరిఫ్, సులేమాన్ జలాశయం పరిధిలోని ఓ నీటి గుంతలోకి దిగారు.
మద్యం మత్తులో ఉన్న వీరు ఈదలేక నీట మునిగిపోయారు. గట్టున ఉన్న గఫార్, ఈశ్వర్లు వారు బయటకు వస్తారని చాలా సేపు వేచి చూశారు. అయితే.. ఎంతకీ రాకపోవడంతో ఆందోళనకు గురై ఆళ్లగడ్డ పట్టణం చేరుకొని గల్లంతైన యువకుల తల్లిదండ్రులకు సమాచారం తెలియజేశారు. గఫార్, ఈశ్వర్ల దుస్తులపై రక్తపు మరకలు ఉండటంతో అనుమానం చెందిన తల్లిదండ్రులు ఆళ్లగడ్డ పోలీసులను ఆశ్రయించారు.