కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ పరిసరాల్లోని గనుల్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వెల్దుర్తి మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన వడ్డే లక్ష్మన్నను గుర్తుతెలియని వ్యక్తులు వాహనంలో వచ్చి కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. విషయం తెలిసిన సీఐ పార్థసారథి రెడ్డి, ఎస్సై సుధాకర్ రెడ్డి, వెల్దుర్తి ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు కల్లూరు మండలం నాయకులు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు హత్య కేసులో మొదటి ముద్దాయిగా ఉన్నాడని తెలిపారు.
కత్తులతో పొడిచి దారుణ హత్య - కర్నూలులో వ్యక్తి దారుణ హత్య తాజా వార్తలు
కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ పరిసరాల్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు వాహనంలో వచ్చి.. కత్తులతో పొడిచి చంపినట్టుగా పోలీసులు తెలిపారు.
కత్తులతో పొడిచి.. ఓ వ్యక్తి దారుణ హత్య