కర్నూలు సమీపంలోని మునగాలపాడులో మద్యం మత్తులో ఓవ్యక్తిని కర్రతో కొట్టి హత్య చేశారు. అదే గ్రామానికి చెందిన చంద్రమణి గ్రామ సమీపంలో శవమై కనిపించాడు. మృతుడు శరీరంపై తీవ్ర గాయాలు ఉండటం, సంఘటన స్థలంలో మద్యం సీసాలు, కర్ర పడి ఉన్నాయి. మద్యం మత్తులోనే గొడవ జరిగి ఉంటుందని.. మృతుడు ఎవరితో కలిసి మద్యం తాగాడు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కొడుమూరు ఎమ్మెల్యే డాక్టర్. సుధాకర్ సంఘటన స్థలాన్ని సందర్శించి మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు.
మద్యం మత్తులో వ్యక్తి దారుణ హత్య.. - కర్నూలు జిల్లా క్రైమ్ తాజా వార్తలు
మద్యం మత్తులో వ్యక్తిని హత్య చేసిన ఘటన కర్నూలు జిల్లాలోని మునగాలపాడులో చోటు చేసుకుంది. సంఘటన స్థలం వద్ద లభించిన ఆధారాలతో మృతుడు ఎవరితో కలిసి మద్యం సేవించాడు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
మద్యం మత్తులో వ్యక్తిని దారుణ హత్య