ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్కకు బావ వేధింపులు... బావమరుదులు ఏం చేశారంటే..! - kurnool district news

కుటుంబ కలహాలు ఓ వ్యక్తి హత్యకు కారణమైన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

MURDER
MURDER

By

Published : Nov 11, 2021, 5:27 PM IST

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఆస్పరి మండలం వెంగళాయదొడ్డి గ్రామంలో సుంకన్న అనే వ్యక్తిని ఇద్దరు బావమరుదులు హత్య చేశారు. భర్తతో గొడవపడి.. సుంకన్న భార్య నారాయణమ్మ ఇటీవలే పుట్టింటికి వెళ్లింది. తమ అక్కను వేధిస్తున్నాడని బావ సుంకన్నపై అక్కసుతో.. అతనిపై రాత్రి కర్రలతో దాడి చేశారు. చికిత్స కోసం ఆదోని ఆస్పత్రికి తరలించే సమయంలో బాధితుడు మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details