ఆదివారం త్రినేత్ర మోహన్ రెడ్డి పట్టణ శివార్లలోని స్టేడియం వద్దకు మార్నింగ్ వాక్కు వెళ్తుండగా వెనకవైపు నుంచి బొలెరో వాహనంలో వచ్చిన కొందరు అతడిపై కర్రలతో దాడి చేశారు. స్టేడియంలో ఉన్న క్రీడాకారులు ఈ విషయం తెలుసుకుని అతని రక్షించేందుకు పరిగెత్తుకొని రావడం చూసిన నిందితులు అదే వాహనంలో పారిపోయారు. గాయపడిన మోహన్‌రెడ్డిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మోహన్‌రెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కారు పార్కింగ్ విషయంలో ఏవీ సుబ్బారెడ్డి కుటుంబంతో కొన్ని రోజుల క్రితం వాగ్వాదం జరిగిందని, ఈ గొడవల కారణంగానే ఏవీ అనుచరులు తనపై దాడి చేశారని మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఏవీ సుబ్బారెడ్డి అనుచరుడు కొండారెడ్డితోపాటు మరో ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని.. ఎస్సై రామిరెడ్డి చెప్పారు.
వీహెచ్‌పీ నేతపై దాడి.. కారు పార్కింగే కారణం! - కర్నూలు వీహెచ్‌పీ జిల్లా ఉపాధ్యాక్షుడు తినేత్ర మోహన్‌రెడ్డి దాడి వార్తలు
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో జిల్లా వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడు, జిల్లా గణేష్ కమిటీ ఛైర్మన్ త్రినేత్ర మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. కారు పార్కింగ్ విషయంలో ఆయన సమీప బంధువు ఏవీ సుబ్బారెడ్డి కుటుంబంతో ఏర్పడిన గొడవలే ఈ ఘటనకి కారణాలుగా తెలుస్తున్నాయి.
murder attempt on vhp kurnool district vice president trinetra mohan reddy