మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో గడువు ముగియనుండటంతో.. అభ్యర్థులు ప్రచారాల్లో నిమగ్నమయ్యారు. ఆఖరి రోజు కర్నూలు నగరంలోని 45, 46 వార్డుల్లో తెదేపా నాయకులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, టీజీ భరత్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ.. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు కుంటుబడుతున్నాయని అన్నారు. ఇసుక కొరత, నిత్యావరస వస్తువుల ధరల పెరుగుదల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిని ఎన్నుకోవాలని భరత్ అన్నారు.
చివరి రోజు.. ప్రచార జోరు
మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆఖరి రోజు కర్నూలు నగరంలోని 45, 46 వార్డుల్లో తెదేపా నాయకులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, టీజీ భరత్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
కర్నూలులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం