కర్నూలును స్వచ్చ నగరంగా తీర్చిదిద్దేందుకు నగరవాసులు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ డీకే. బాలాజీ కోరారు. నగరంలో చెత్త కుండీలు తీసివేశామన్నారు. ఎవరైనా రహదారి పక్కన చెత్తవేస్తే జరిమానా విధిస్తామని కమిషనర్ తెలిపారు. నగరంలోని గాంధీనగర్ వద్ద కమిషనర్ కుర్చోని.. చెత్త వేయడానికి వచ్చిన వారికి అవగాహన కల్పించి జరిమానా విధించారు. కార్పొరేషన్ సిబ్బంది వచ్చినప్పుడు మాత్రమే చెత్త వెయ్యాలని కోరారు.
'కర్నూలును స్వచ్చత నగరంగా తీర్చిదిద్దే బాధ్యత అందరిదీ' - Kurnool Latest News
నగరాన్ని స్వచ్చత కర్నూలుగా తీర్చిదిద్దేందుకు నగరవాసులందరు సహకరించాలని కమిషనర్ డీకె.బాలాజీ కోరారు. చెత్తను కార్పొరేషన్ సిబ్బంది వచ్చినప్పుడు మాత్రమే వేయాలని తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నగరవాసులతో మాట్లాడుతున్న కర్నూల్ కమిషనర్ డీకె.బాలాజీ
కర్నూలును స్వచ్చ నగరంగా తీర్చిదిద్దుతామని మేయర్ బీవై రామయ్య అన్నారు. గతంలో చెత్తకుండీలు ఉన్న ప్రాంతాన్ని సుందరంగా తయరుచేసి అక్కడ ఎవరూ చెత్త వెయ్యకుండా ఆ ప్రాంతానికి చెందిన కార్పొరేటర్లు అక్కడే కుర్చొని ఉంటారని మేయర్ తెలిపారు. నగరంలోని 52 వార్డుల్లో ఈ కార్యక్రమం రేపటినుండి కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమంపై కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్లకు అవగాహన కల్పించారు.
ఇవీ చదవండి