'మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి' - ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
మున్సిపల్ కార్మికులను అందరిని పర్మినెంట్ చెయ్యాలని... కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కార్మికులను అందరిని పర్మినెంట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన కార్మికులను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఎన్నికల సమయంలో... అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్, ఒప్పంద కార్మికులను పర్మినెంట్ చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారని... అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిన ఇచ్చిన హామీని నెరవేర్చలేదని సీఐటీయూ నాయకులు గుర్తుచేశారు.
ఇది చదవండి శ్రీశైలం దేవస్థానం అక్రమాలపై అనిశా విచారణ..!