తమను విధుల్లో నుంచి తొలిగించే ఆలోచనను విరమించుకోవాలని కర్నూలు జిల్లా నంద్యాలలో పురపాలక సంఘ పారిశుద్ధ్య కార్మికులు విన్నవించారు. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆరునెలల క్రితం పారిశుద్ధ్య కార్మికులుగా చేరామని.. ప్రస్తుతం మరో గుత్తేదారుకు పారిశుధ్య నిర్వహణ ఇస్తున్నారని తెలిపారు. వేరే వారిని నియమించకుండా తమనే కొనసాగించాలని చూడాలని వేడుకున్నారు. సమస్యను పరిష్కరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు.
ఎంపీకి పారిశుద్ధ్య కార్మికుల వినతి - kurnool
కర్నూలు జిల్లా నంద్యాలలో పారిశుద్ధ్య కార్మికులు ఎంపీ బ్రహ్మానందరెడ్డిని కలిశారు. తమను విధుల్లో నుంచి తొలగించొద్దని వినతిపత్రం అందజేశారు.

మున్సిపల్ కార్మికులు