మరో 2 నెలల వరకూ లాక్‌డౌన్‌కు సిద్ధంగా ఉండాలి: టీజీ వెంకటేష్ - టీజీ వెంకటేష్ తాజా వార్తలు
కరోనాను ప్రతి ఒక్కరి సమన్వయంతోనే కట్టడి చేయవచ్చని ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. లాక్డౌన్ ఈ నెల వరకే కాదని... మరో రెండు నెలలకు వరకూ ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.
మరో 2 నెలల వరకూ లాక్‌డౌన్‌కు సిద్ధంగా ఉండాలి: టీజీ వెంకటేష్
మరో 2 నెలల వరకూ లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని ఎంపీ టీజీ వెంకటేష్ పిలుపునిచ్చారు. కర్నూలులో మాట్లాడిన ఆయన... ప్రజలకు సరైన అవగాహన లేకపోవటం వల్లే లాక్‌డౌన్‌లోనూ రోడ్లపైకి వస్తున్నారన్నారు. జాతీయ రహదారిలో నిలిపివేసిన వాహనాలను వెంటనే పంపాలని డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే కరోనాను జయించవచ్చని వివరించారు.