కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా మండలం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణా జలాలను ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి విడుదల చేశారు. నందికొట్కూరు, శ్రీశైలం ఎమ్మెల్యేలతో కలిసి పూజలు నిర్వహించి.. మోటర్ ఆన్ చేసి గేట్లు ఎత్తారు. రెండు వేల క్యూసెక్కుల నీటిని కాల్వకు విడుదల చేస్తున్నట్లు ప్రజా ప్రతినిధులు తెలిపారు. ఆ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం డ్యామ్ కు వరద జలాలు చేరుకోవడంతో.. పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటి విడుదల - latest news in kurnool district
ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణా జలాలను విడుదల చేశారు. అనంతరం నందికొట్కూరు, శ్రీశైలం ఎమ్మెల్యేలతో కలిసి పూజలు నిర్వహించారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్