కర్నూలు జిల్లా నంద్యాలలో కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తానని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హమీని తూ.చ తప్పకుండా నెరవేరుస్తానని స్పష్టం చేశారు. తంగడంచలో విత్తన భాండాగారం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని... వ్యవసాయ ఆధార పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని వెల్లడించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా పార్లమెంట్‌లో పోరాడతానని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఈటీవీ భారత్తో చెప్పారు.