ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు పోలీసు సంక్షేమ నిధికి ఎంపీ బ్రహ్మానంద రెడ్డి భారీ విరాళం - ఎంపీ బ్రహ్మానంద రెడ్డి

ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి.. పోలీసుల సంక్షేమానికి భారీ విరాళం ఇచ్చారు. కర్నూలు జిల్లా పోలీసులకు కరోనా రక్షక్ పాలసీ కింద ప్రీమియం మొత్తాన్ని ఎస్పీ ఫక్కీరప్పకు అందజేశారు.

mp pocha huge donation to kurnool police
కర్నూలు జిల్లా పోలీసుల సంక్షేమానికి ఎంపీ పోచా భారీ విరాళం

By

Published : May 12, 2021, 5:53 PM IST

కర్నూలు జిల్లా పోలీసుల సంక్షేమ నిధికి నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి రూ.20 లక్షలు విరాళంగా ఇచ్చారు. ‘ఎస్బీఐ కరోనా రక్షక్ పాలసీ’ ప్రీమియం మొత్తాన్ని చెక్కు రూపంలో.. జిల్లా ఎస్పీ ఫక్కీరప్పకు అందజేశారు. ఈ పాలసీ జిల్లాలోని ప్రతి పోలీసుకూ వర్తిస్తుందన్నారు. కరోనా సమయంలో పోలీసులు చేసిన సేవలు మరువలేమని ఎంపీ కొనియాడారు. ఎంత చేసినా తక్కువే అని.. అందుకే తన వంతుగా వారి సంక్షేమానికి రూ.20 లక్షలు విరాళమిచ్చినట్లు తెలిపారు.

పోలీసుల సంక్షేమానికి విరాళం ఇచ్చి.. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి తన ఉదారతను చాటుకున్నారని ఎస్పీ ఫక్కీరప్ప అన్నారు. పోలీసులు రేయింబవళ్లు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి, పలువురు పట్టణ సీఐలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details