దారుణం: పుట్టిన రోజు ఘనంగా జరపలేదని.. కుమారుడిని చంపిన తల్లి - rudravaram mother kills son updates
12:04 April 28
కుమారుడిని చంపిన తల్లి
కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి ఆ చిన్నారి గొంతుకోసి ప్రాణాలు తీసింది. కుమారుడి పుట్టిన రోజు వేడుకల్ని, తన బావ కుమారుడి పుట్టిన రోజు వేడుకలా ఘనంగా చేయలేదన్న అసూయతో ఈ ఘాతుకానికి పాల్పడింది. కర్నూలు జిల్లా రుద్రవరానికి చెందిన రైతు సుధాకర్‌కు తన సొంత అక్క కుమార్తె మౌనికతో మూడేళ్ల కిందట వివాహం అయ్యింది. వీరికి ఏడాది వయస్సున్న విక్రమ్ ఉన్నాడు.
గతంలో సుధాకర్ అన్న కుమారుడి మొదటి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 26న విక్రమ్ మొదటి పుట్టిన రోజు వేడుకల్ని కూడా అలాగే ఘనంగా నిర్వహించాలని మౌనిక పట్టుబట్టింది. సుధాకర్ మాత్రం సాదాసీదాగా చేశారు. దీంతో మనస్తాపానికి గురైన మౌనిక.. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూరగాయలు కోసే కత్తితో కుమారుడి గొంతు కోసింది. అనంతరం బంధువులు తనను ఏమైనా చేస్తారన్న భయంతో మౌనిక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంటి బయటికొచ్చి వాంతులు చేసుకుంటుండగా స్థానికులు గమనించి ఇంట్లోకి వచ్చి చూడగా రక్తపు మడుగులో నిర్జీవంగా ఉన్న విక్రమ్ కనిపించాడు. మౌనికను నంద్యాలకు తరలించారు.
ఇదీ చదవండి:కుమార్తెను ప్రేమించాడని యువకుడి కాళ్లు, చేతులు నరికి చంపేశారు