mother and son suicide: చెరువులో దూకి తల్లీకుమారుడు ఆత్మహత్య ! - కర్నూలులో చెరువులో దూకి తల్లీ కుమారుడు ఆత్మహత్య
![mother and son suicide: చెరువులో దూకి తల్లీకుమారుడు ఆత్మహత్య ! mother and son suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13088894-143-13088894-1631863318511.jpg)
11:06 September 17
చెరువులో దూకి ప్రాణాలు తల్లీకుమారుడు
కర్నూలు జిల్లా సంజామల మండలం నొస్సం గ్రామంలో చెరువులో దూకి తల్లీ కుమారుడు ప్రాణాలు తీసుకున్నారు. కడప జిల్లా మైలవరానికి చెందిన చెన్నం మాధవి.. ఐదేళ్ల తన కుమారుడు నాగ పూజిత్‌తో కలిసి జమ్మలమడుగులో నివాసముంటుంది. మాధవి భర్త నాగరాజు చెన్నై సమీపంలోని కోయంబత్తూరు సిమెంటు పరిశ్రమలో పని చేస్తున్నాడు. అయితే తల్లీకుమారుడు చెరువులో శవమై తేలగా గుర్తించిన స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న సంజామల పోలీసులు.. మృతదేహాలను వెలికితీశారు. వీరి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి..
Saidabad Rape case : సైదాబాద్ రేప్ కేసు నిందితుడి మృతిపై హైకోర్టులో పిల్