ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుటుంబ కలహాలు..కుమార్తెతో సహా తల్లి ఆత్మహత్య - గుంటుపల్లిలో తల్లీ కుమార్తె మృతి వార్తలు

కుటుంబ కలహాలతో ఆరేళ్ల కూతురితో సహా తల్లి బలవన్మరణం చెందిన ఘటన కర్నూలు జిల్లా గుంటుపల్లిలో జరిగింది. గుళికలు మింగిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

mother and daughter suicide in guntupalli kurnool district
కుటుంబ కలహాలతో కుమార్తెతో సహా తల్లి ఆత్మహత్య

By

Published : Jun 21, 2020, 5:30 PM IST

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం గుంటుపల్లిలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో కుమార్తెతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన శశికళకు ఆరేళ్ల కూతురు నవ్యశ్రీ, 10 నెలల కుమారుడు ఉన్నారు. శశికళ గ్రామ వాలంటీర్​గా పని చేస్తోంది. ఈరోజు ఉదయం అత్త, భర్తతో ఆమెకు గొడవ అయ్యింది.

ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పాపకు వ్యవసాయానికి ఉపయోగించే టిమెంట్ గుళికలు ఇచ్చి తాను కూడా మింగింది. ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరు మార్గమధ్యంలో మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details