Mother And Children Suicide Attempt : తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం బాలాపూర్లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వాంఖడే సుష్మ అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి యత్నించింది. గమనించిన స్థానికులు తల్లిని రక్షించగా.. నాలుగేళ్ల ఆదిత్య, రెండేళ్ల వయసున్న ఆర్యన్ బావిలో మునిగి ప్రాణాలొదిలారు. సుష్మ భర్త గణేశ్ కూలీ పనులకు వెళ్లగా.. మహిళ సైతం ఇద్దరు చిన్నారులను వెంటబెట్టుకుని పనులకు వెళ్లింది. పని ప్రదేశానికి సమీపంలోనే బావిలో దూకగా.. గమనించిన పొలం యజమాని ముగ్గురినీ బయటకు తీశాడు.
ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకిన తల్లి.. చిన్నారులు మృతి - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
Mother And Children Suicide Attempt : తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో చిన్నారులు మృతి చెందగా.. తల్లిని స్థానికులు రక్షించారు.

Etv Bharat
తల్లి సుష్మ ప్రాణాలతో బయటపడగా.. చిన్నారులిద్దరూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న సుష్మ భర్త, బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విగత జీవులుగా మారిన చిన్నారులను చూసి కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో రాత్రి గొడవ జరిగిందని.. ఆ ఆవేశంలోనే సుష్మ బలవన్మరణానికి యత్నించి చిన్నారులను పోగొట్టుకుందని గ్రామస్థులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: