ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో అత్యాధునిక వైద్యం' - kurnool latest news

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో అత్యాధునిక చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ నరేంద్ర అన్నారు. కరోనా సోకిన వ్యక్తికి డయాలసిస్ చేశామని చెప్పారు.

kurnool-govt-hospital
కర్నూలు ప్రభుత్వాసుపత్రి

By

Published : Sep 20, 2020, 8:23 AM IST

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో అధునాతన వైద్యం అందిస్తున్నామని ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన ఓ వ్యక్తి... కిడ్నీ వ్యాధితో బాధపడుతూ, కరోనా బారిన పడ్డారు. రెగ్యులర్ డయాలసిస్ కోసం... ఒంగోలు నుంచి కర్నూలుకు తరలించారు.

బాధితుడిని 14 రోజులు ఆసుపత్రి ఐసీయూలో ఉంచి, డయాలసిస్ చేశారు. కరోనా నెగిటివ్ రావడంతో రోగిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఈ విధమైన చికిత్స అందించేందుకు ప్రైవేటు ఆస్పత్రిలో ఖర్చుతో కూడుకున్నదని, అయితే ప్రభుత్వాసుపత్రిలో ఎలాంటి ఆర్థిక ఖర్చులు ఉండవని డాక్టర్ సురేంద్రనాథ్​రెడ్డి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details