ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మొబైల్​ రైతు బజార్ ఉండగా.. టెన్షన్ ఎందుకు దండగా! - mobile vegetable market latest news

కరోనా నివారణ చర్యల్లో భాగంగా కర్నూలులో మొబైల్ రైతు బజార్​లను కలెక్టర్ వీర పాండియన్ ప్రారంభించారు. మార్కెట్​లకు వెళ్లకుండా ఇంటి వద్దనే కూరగాయలను కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు.

mobile vegetable market in kurnool
మొబైల్​ రైతు బజార్

By

Published : Apr 25, 2021, 9:36 AM IST

కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న తరుణంలో కర్నూలు జిల్లా కలెక్టర్ వీర పాండియన్ మొబైల్ రైతు బజార్​లను ప్రారంభించారు. కర్నూలు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో.. నివారణ చర్యల్లో మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేశారు. ప్రజలు ఎక్కువగా మార్కెట్​లకు వెళ్లకుండా ఇంటి వద్దనే కూరగాయలను కొనుగోలు చేయాలని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నగరంలో 5 మొబైల్ రైతు బజార్లను అందుబాటులోకి తెచ్చామని.. త్వరలో వాటి సంఖ్యను పెంచుతామని కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డీకే బాలజీ వెల్లడించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details