'ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలి' - nandyal
ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల మండలంలో పర్యటించి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

'ఉపాధి కూలీల సమస్యలు తీర్చాలి'
కర్నూలు జిల్లా నంద్యాల మండలంలోని బిల్లాలపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు పర్యటించారు. ఎండలు మండుతున్న క్రమంలో నీడలేక ఇబ్బందులు పడుతున్న కార్మికులను కలిసి సాదకబాధకాలు తెలుసుకున్నారు. వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
'ఉపాధి కూలీల సమస్యలు తీర్చాలి'