ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటు పడతామని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికెరలోని కస్తూర్బా బాలికల ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించారు. కస్తూర్బాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని నరసింహారెడ్డి హామీ ఇచ్చారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాం: ఎమ్మెల్సీ కత్తి - ysrcp
ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి వైకాపా ప్రభుత్వం పాటు పడుతుందని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి చెప్పారు.
![ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాం: ఎమ్మెల్సీ కత్తి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4207279-116-4207279-1566468298062.jpg)
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాం - ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి