జిల్లా ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేలకు చేదు అనుభవం - నంద్యాల జిల్లా వార్తలు
16:28 April 04
ప్రొటోకాల్ పాటించలేదని కలెక్టర్‌పై ఎమ్మెల్యేల ఆగ్రహం
నూతనంగా ఏర్పడిన నంద్యాల జిల్లా ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురైంది. ప్రారంభోత్సవ శిలాఫలకంపై తమ పేర్లు లేవని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానిని.. శాసనసభ్యులు శిల్పాచక్రపాణి రెడ్డి, కాటసాని రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, తొగురు ఆర్థర్ నిలదీశారు. శాసనసభ్యుల్ని మర్చిపోయారా..? ప్రోటోకాల్ పాటించలేదు ఎందుకని? అంటూ కలెక్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.