ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే - కర్నూలు సమాచారం

కర్నూలులోని స్వామిరెడ్డి నగర్​లో జరిగిన అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన వారిని ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ పరామర్శించారు. వారికి ఆర్థిక సహాయంతో పాటు.. సామగ్రి అందజేశారు.

MLA who consulted fire victims in Kurnool district
అగ్ని ప్రమాద భాదితులను పరామర్శించిన ఎమ్మెల్యే

By

Published : Jan 4, 2021, 8:24 PM IST

కర్నూలులోని స్వామి రెడ్డి నగర్​లో జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అగ్ని ప్రమాదం జరిగి.. మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్న మరో మూడు గుడిసెలకు విస్తరించాయి. ఈ ప్రమాదంలో రూ. 5 లక్షల విలువ చేసే బంగారు వస్తువులతో పాటు నగదు కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. సమాచారం తెలిసిన స్థానిక ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వారికి ఆర్థిక సహయంతో పాటు.. వస్తువులను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details