YCP MLA: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో అడుగడుగునా అవమానాలు, నిరసనలు ఎదరవుతున్నాయి. సొంత మండలమైన మర్రిపాడులోనూ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతలు ఎదరయ్యాయి. ఎమ్మెల్యే వెంట ప్రజలు రాకపోవడంతో, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్దులను వినియోగించటమే కాకుండా.. వారి చేత ఎమ్మెల్యే కాళ్ళపై పూలు చల్లించటం విమర్శలకు తావిచ్చింది. సంక్షేమ పథకాలు అందకనే అందినట్టు కరపత్రాలు పంపిణీ చేశారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఎమ్మెల్యే మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు.
'గడప గడప'లో ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డికి అడుగడుగునా అవమానాలు - గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం
YCP MLA : నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి అడుగడుగునా నిరసన సెగలు తగులుతున్నాయి. సొంత మండలంలోనే మహిళలు ప్రశ్నల వర్షం కురిపించడంతో మహిళలు, మీడియావారిపై ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యం చేశారు.
ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి