ఇంటి పట్టా లబ్దిదారులతో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కర్నూలు జిల్లా అదోనిలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక వైకాపా కార్యాలయం నుంచి వైస్సార్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పెద్ద పీట వేశారని...ఈ నెల 25 న లబ్దిదారులకు ఇంటి పట్టాలను అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం అంటే ఇలా ఉండాలని... దేశానికి ఆదర్శంగా నిలుస్తూ చాలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియడారు.
'సీఎం జగన్ దేశానికే ఆదర్శం' - ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ర్యాలీ
కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇంటి పట్టా లబ్దిదారులతో భారీ ర్యాలీ చేపట్టారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు సీఎం జగన్ పెద్ద పీట వేశారన్నారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తూ చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు.
!['సీఎం జగన్ దేశానికే ఆదర్శం' mla rally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9982406-218-9982406-1608734054793.jpg)
ర్యాలీ