ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అర్హులైన వారికి నేరుగా ఇళ్ల పట్టాలు: ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ - కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ ర్యాలీ

ఇళ్ల పట్టాల పంపిణీ అంశంపై కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్, సీఎం జగన్​కు ధన్యవాదాలు తెలిపారు. నగరంలోని కోట్ల కూడలి నుంచి వైఎస్సార్ కూడలి వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా అర్హులైన వారికి నేరుగా ఇళ్ల పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.

MLA Hafeez Khan comments
ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్

By

Published : Dec 24, 2020, 4:02 PM IST

గతంలో ఎవ్వరూ ఇవ్వని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలను ఇవ్వనుందని కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా అర్హులైన వారికి నేరుగా ఇళ్ల పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. సీఎం జగన్​కు ధన్యవాదాలు తెలుపుతూ నగరంలోని కోట్ల కూడలి నుంచి వైఎస్సార్ కూడలి వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించారు.

ABOUT THE AUTHOR

...view details