ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కల్తీ మద్యం కేసులో ఎమ్మెల్యే అనుచరుడి అరెస్ట్

కర్నూలు జిల్లాలో అక్రమ మద్యం తయారుచేస్తోన్న ముఠాను ఎక్సైజ్​ అధికారులు అరెస్టు చేశారు. కర్ణాటక నుంచి స్పిరిట్ తెప్పించుకుని మద్యం తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుల్లో ఓ ఎమ్మెల్యే అనుచరుడు, వీఆర్వో ఉన్నారు.

By

Published : Dec 10, 2019, 7:38 PM IST

MLA follower arrest in adulterated liquor case
కల్తీ మద్యం

కల్తీ మద్యం ముఠా అరెస్ట్

కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం అమకతాడు గ్రామంలో ఈ నెల 7న కల్తీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనుచరుడు, కృష్ణగిరి మండల వైకాపా నాయకుడు బ్రహ్మానంద రెడ్డిని ఎక్సైజ్ అధికారులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపారు. అతనిచ్చిన సమాచారంతో జిల్లాలోనికృష్ణానగర్​లో కల్తీ మద్యం తయారీ కేంద్రంపై డోన్​ ఎక్సైజ్ పోలీసులు, ఎన్​ఫోర్స్​మెంట్, టాస్క్​ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మద్యం తయారీ కేంద్ర నిర్వాహకుడు వీఆర్వో విష్ణువర్దన్​ రెడ్డితో పాటు కృష్ణమూర్తి, భాస్కర్​లను అదుపులోకి తీసుకున్నారు. వీరు కర్ణాటక నుంచి స్పిరిట్ తెప్పించుకుని కృష్ణానగర్​లోని ఓ ఇంట్లో కల్తీ మద్యం తయారుచేస్తున్నారని ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్​ చెన్నకేశవులు వెల్లడించారు. దీనిని గ్రామాల్లో విక్రయిస్తున్నారని తెలిపారు. కల్తీ మద్యంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు దాడి చేసి నిందితులను పట్టుకున్నామని వివరించారు. వీరికి స్పిరిట్​ సరఫరా చేసే వ్యక్తి కర్ణాటకలో ఉన్నాడని.. అతని అరెస్టుకు రంగం సిద్ధం చేశామని డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు. గ్రామాల్లో ఎవరైనా కల్తీ మద్యం తయారుచేసినా.. అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details