కర్నూలు జిల్లా నంద్యాల పరిధిలో గత ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన మిరపకు ప్రస్తుతం దిగుబడులు రానున్నాయి. ఎకరానికి 20 క్వింటాళ్ల నుంచి గరిష్టంగా 25 క్వింటాళ్ల మేర దిగుబడి రావాల్సిన ఉంది. కానీ ఎండు తెగులు సోకటంతో ఈ దిగుబడి.. పది క్వింటాళ్లకు పడిపొయింది.
నాణ్యత లోపంతో.. నష్టం అధికం
ఈ పంట సాగు కోసం పెట్టుబడిగా.. ఎకరాకు(కౌలుతో సహా) లక్షా యాభై రూపాయలను అన్నదాత వెచ్చించాడు. ప్రస్తుతం నాణ్యమైన మిర్చి ఒక క్వింటాకు 13 వేల రూపాయల మార్కెట్ ధర ఉంది. కానీ సరకు బాగాలేదని వంక చూపి.. క్వింటాకు అయిదువేల రూపాయల కూడా ఇవ్వటం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.