కర్నూలు జిల్లాలోని ఆరు మండలాల్లో గత నాలుగేళ్లుగా చీడపీడల బారిన పడడం, తెగుళ్లు సోకడంతో పండు మిరప రైతుకు కన్నీళ్లు మిగిలాయి తప్పితే పెట్టిన పెట్టుబడి సైతం రాలేదు. ఈ ఏడాదైనా లాభాలు వస్తాయని ఆశతో సాగుచేసిన రైతులు దిగుబడులు తగ్గడం, వచ్చిన పంటకు గిట్టుబాటు ధరలేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తుండడంతో పెట్టిన పెట్టుబడి సైతం రాదని, నష్టాలపాలు కావాల్సిందేనని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
పెరిగిన సాగు వ్యయం..
ఎకరాకు విత్తనాలు, సేద్యం, ఎరువులు, మందులు, కూలీలు, రవాణా అన్ని కలుపుకుని రూ.1,70,000 వరకు ఖర్చు వస్తోంది. ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 10 క్వింటాళ్ల మాత్రమే వస్తోంది. బ్యాడిగ రకం అయితే క్వింటానికి రూ.16వేల నుంచి రూ.17వేల వరకు ధర పలుకుతుండగా రైతులు ఎక్కువగా సాగుచేసిన సూపర్ టెన్ రకం క్వింటా రూ.11వేల నుంచి రూ.12వేలు పలుకుతోంది. ఈ లెక్కన ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా రైతుకు వచ్చేది రూ.1,44,000 మాత్రమే!
అప్పుచేసి సాగు..