కర్నూలు జిల్లాలోని ఆదోనిలో మంత్రులు ఆళ్ల నాని, గుమ్మనూరు జయరాం పర్యటించారు. అతిసారం వ్యాధితో బాధపడుతున్న బాధితులను పరామర్శించారు. వాంతులు, విరేచనాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఒకే మంచంపై ఇద్దరు బాధితులు చికిత్స పొందుతున్న తీరు చూసి అధికారుల తీరుపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతిసారంతో మృతి చెందిన రంగమ్మ కుటుంబానికి రూ.3 లక్షల పరిహారం అందిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.
ఆదోనిలో మంత్రుల పర్యటన..అతిసారం బాధితులకు పరామర్శ - ఏపీ తాజా వార్తలు
ఆదోనిలోని అరుణ జ్యోతి నగర్లో అతిసారం వ్యాధితో బాధపడుతున్న బాధితులను మంత్రులు ఆళ్ల నాని, గుమ్మనూరు జయరాం పరామర్శించారు. వ్యాధికి గల కారణాలు, బాధితులకు అందుకున్న వైద్యంపై అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు 3 లక్షలు పరిహారం ప్రకటించారు.
అతిసారం బాధితులకు మంత్రి ఆళ్ల నాని పరామర్శ