కర్నూలు కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో మంత్రులు గుమ్మనూరు జయరాం, అనిల్ కుమార్ యాదవ్‌తో కలిసి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ఓ కమిటీని నియమించిందని... ఆ కమిటీ రిపోర్టు ఆధారంగా... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి తెలిపారు. కృష్ణా బోర్డు కార్యాలయం కర్నూలులో పెట్టాలన్న డిమాండ్ ఉందని... ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టుల విషయమై త్వరలో సమీక్షించి... నిర్ణయం తీసుకుంటామన్నారు. పాఠశాల అభివృద్ధికి నాడు-నేడు కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు.
'రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం'
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ఓ కమిటీని నియమించిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. ఆ కమిటీ రిపోర్టు ఆధారంగా... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను... అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.
ministers pressmeet in kurnool collectorate