రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయని... దీన్ని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో దిల్లీకి వెళ్లి వచ్చిన వారే ఉన్నారని గుర్తుచేశారు.
'కరోనా నివారణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది' - ministers alla nani and buggana comments in korona
కరోనా కట్టడికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన అన్నారు. కర్నూలులో నమోదైన పాజిటివ్ కేసుల్లో ఎక్కువ దిల్లీకి వెళ్లి వచ్చిన వారివేనని వారు తెలిపారు.
ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని
కర్నూలు నమూనాలను అనంతపురం ల్యాబ్‌కు పంపిస్తున్నామని... అందువల్లే ఆలస్యం అవుతుందని చెప్పారు. అలా కాకుండా ఉండేందుకు కర్నూల్లోనే ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి బుగ్గన తెలిపారు. అప్పటివరకు హైదరాబాద్‌లో పరీక్షలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడుతున్నట్లు వివరించారు.
ఇవీ చదవండి...నిర్మాణరంగ కార్మికులను ఆదుకోండి: సీఎంకు కన్నా లేఖ