కరోనా నేపథ్యంలో వాల్మీకి సోదరులు ఎక్కడికక్కడే కార్యక్రమాలు నిర్వహించుకోవాలని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. అక్టోబర్ 31న కర్నూల్లో మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఏటా ఒక జిల్లాలో ఈ ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తోందని.. గతేడాది అనంతలో జరిపామని ఆయన గుర్తు చేశారు. అందుబాటులో ఉన్న వాల్మీకి పెద్దలు కర్నూల్ కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.
31న జిల్లాలో మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలు - మంత్రి గుమ్మనూరు జయంతి తాజా వార్తలు
కర్నూలు జిల్లాలో మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. గతేడాది అనంతపురం జిల్లాలో జరిపినట్లు ఆయన గుర్తు చేశారు. అందుబాటులో ఉన్న వారు కడప కలెక్టరేట్లో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.
మంత్రి గుమ్మనూరు జయరాం