సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జయరాం - వైద్యులు
ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆదేశించారు. కర్నూలులోని ఆలూరులో కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

minister_jayaram_visit_hospitals
సమస్యలు వెంటనే పరిష్కరిస్తాం:మంత్రి జయరాం
కార్మికశాఖ కార్యాలయాన్ని మంత్రి పరిశీలించారు. కార్మికులకు గుర్తింపు కార్డులను అందజేశారు. అక్కడి నుంచి ఐటీఐ కళాశాలలను పరిశీలించారు. కళాశాలకు పక్కా భవనం నిర్మించుకునేందుకు స్థలం కావాలని కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఆయనకు విన్నవించారు. తొలుత... వైద్యులు తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రిని కోరారు.