వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కర్నూలులో వాల్మీకి మహర్షి రాష్ట్ర స్థాయి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి... వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాల్మీకుల సమస్యలను పరిష్కరించే దిశగా వైకాపా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. బుడగ జంగాలను ఎస్సీలు, వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించేందుకు కృషి చేస్తామన్నారు.
వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించేందుకు సీఎం హామీ: మంత్రి జయరాం - వాల్మీకి జయంతి వేడుకలు
వాల్మీకుల సమస్యలను పరిష్కరించే దిశగా వైకాపా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. వారిని ఎస్టీలుగా గుర్తించేందుకు సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు.
minister jayaram