MINISTER JAYARAM ON ITTINA LANDS : కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో ఇట్టినా కంపెనీ నుంచి తాను కొనుగోలు చేసిన భూముల్లో రైతులవి ఎవరివైనా ఉంటే.. వాటిని మార్కెట్ ధర ప్రకారం రైతులకు రిజిస్ట్రేషన్ చేయిస్తానని.. కార్మిక శాఖ మంత్రి జయరాం ప్రకటించారు. ఆస్పరిలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన మంత్రిని.. ఇట్టినా కంపెనీకి భూములు ఇచ్చిన రైతులు, సీపీఎం నాయకులు అడ్డుకునేందుకు యత్నించగా.. పోలీసులు నిలువరించారు. అనంతరం అంబేడ్కర్ సర్కిల్‌లో జగన్ జన్మదినోత్సవాల్లో పాల్గొన్న జయరాం.. రైతులకు భూముల రిజిస్ట్రేషన్ ప్రతిపాదన చేశారు. ఐతే జయరాం కొన్న భూములను ఆదాయపు పన్నుశాఖ అటాచ్ చేసిందని, ఆ భూములను రైతులకు రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పడం ఏంటని సీపీఎం నేతలు ప్రశ్నిస్తున్నారు.
రైతుల భూములుంటే.. ప్రస్తుత ధరతో, వారికే ఇచ్చేస్తా..! : మంత్రి గుమ్మనూరు
MINISTER GUMMANURU ON ITTINA LANDS : ఇట్టినా కంపెనీ నుంచి తాను కొనుగోలు చేసిన భూముల్లో రైతులవి ఉంటే.. వాటిని వాళ్ల పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయిస్తానని మంత్రి జయరాం స్పష్టం చేశారు. భూములు అమ్మిన రైతులు ఎవరైనా ఉంటే తన ఇంటికి రావాలని సూచించారు.
MINISTER GUMMANURU ON ITTINA LANDS
"నేను కొన్న వాటిలో ఇట్టినా కంపెనీ భూములుంటే తిరిగిచ్చేస్తా. మార్కెట్ విలువ ప్రకారం తిరిగి ఇచ్చేస్తా. భూములు అమ్మిన రైతులు మా ఇంటికి రండి. అమ్మిన రైతుల పేరిటే భూములు రిజిస్ట్రేషన్ చేయిస్తా. భూములు అమ్మిన రైతులు విపక్షాల దగ్గరకు వెళ్లొద్దు"-గుమ్మనూరు జయరాం, మంత్రి
ఇవీ చదవండి: