కులమతాలకు అతీతంగా.. పథకాలు చేరుస్తా: బుగ్గన - tally
ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా సొంత నియోజక వర్గం డోన్ కు బుగ్గన వెళ్లారు. పార్టీ కార్యకర్తలు,నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన.. కర్నూలు జిల్లా డోన్‌లో పర్యటించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన నియోజకవర్గానికి వెళ్లారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మంత్రికి ఘన స్వాగతం పలికారు. డోన్ లోని కోట్ల వారి పల్లె నుంచి పాతబస్టాండ్ వరకు నిర్వహించిన ర్యాలీలో బుగ్గన పాల్గొన్నారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభలో క్రేన్ సహాయంతో బుగ్గనకు గజమాల వేశారు. రైతులకు పంట పెట్టుబడి సహాయం, భీమా, భరోసా, అమ్మఒడి వంటి పథకాలను... కుల మతాలు, రాజకీయాలకు అతీతంగా అందరికీ అందేలా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.