Minister Buggana Rajendranath : కర్నూలు జిల్లా డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సీజన్ ప్లాంటును ప్రారంభించి వెళ్తున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కాన్వాయ్‌ని దొరపల్లి గ్రామానికి చెందిన కొందరు రైతులు అడ్డుకున్నారు. తమ పొలాలను లాక్కునేందుకు పలువురు వైకాపా నేతలు యత్నిస్తున్నారని.. మాకు న్యాయం చేయాలని మంత్రిని వేడుకున్నారు.
డోన్ మార్కెట్ యార్డు ఛైర్మన్ రామచంద్రుడు, దొరపల్లెకి చెందిన వైకాపా నేత చిరంజీవి, డోన్ ఎంపీపీ రాజశేఖర్.. తమ పొలాలను కాజేసేందుకు యత్నిస్తున్నారని బాధిత రైతులు నాగేంద్ర, నారాయణ.. మంత్రికి వివరించారు. తమను పలుమార్లు భయాందోళనకు గురిచేశారని, పొలాల విషయం మాట్లాడితే కేసులు పెడతామని భయపెడుతున్నారని, తమకు న్యాయం చేయాలని మంత్రిని వేడుకున్నారు.