కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పూరీని దిల్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కలిశారు. ఓర్వకల్లు, భోగాపురం విమానాశ్రయాలు సహా పలు అంశాలపై చర్చించారు. వాణిజ్య కార్యకలాపాలకు ఓర్వకల్లు విమానాశ్రయం సిద్ధమైందని బుగ్గన వెల్లడించారు. చివరి దశ అనుమతులపై కేంద్రమంత్రితో చర్చించామని తెలిపారు. త్వరలో ఓర్వకల్లు విమానాశ్రయం ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిందని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం అంశాన్ని కూడా చర్చించామన్న బుగ్గన.. త్వరగా పనులు చేసేలా అనుమతులు ఇవ్వాలని కోరామన్నారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి బుగ్గన తెలిపారు.
వాణిజ్య కార్యకలాపాలకు ఓర్వకల్లు విమానాశ్రయం సిద్ధం: బుగ్గన - ఓర్వకల్లు విమానాశ్రయం ప్రారంభంపై బుగ్గన కామెంట్స్
కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయాన్ని త్వరలో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. వాణిజ్య కార్యకలాపాలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి అనుమతులపై కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పూరీని బుగ్గన కలిశారు.
![వాణిజ్య కార్యకలాపాలకు ఓర్వకల్లు విమానాశ్రయం సిద్ధం: బుగ్గన వాణిజ్య కార్యకలాపాలకు ఓర్వకల్లు విమానాశ్రయం సిద్ధం: బుగ్గన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9819719-625-9819719-1607511071565.jpg)
వాణిజ్య కార్యకలాపాలకు ఓర్వకల్లు విమానాశ్రయం సిద్ధం: బుగ్గన
TAGGED:
orvakal airport starts news